Mahesh Babu, Trivikram: మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా పరిస్థితి నుయ్యి – గొయ్యి!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా గురించి చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. అప్పుడెప్పుడో అనౌన్స్‌ చేసి. ఆ తర్వాత చాలా రోజులకు సినిమా ముహూర్తపు షాట్‌ కొట్టారు. ఆ తర్వాత అయినా సినిమా మొదలుపెట్టేస్తారు అనుకుంటే అనుకున్నది జరగలేదు. ఆ తర్వాత జూన్‌లో మొదలు అన్నారు, తర్వాతు జులై అన్నారు. ఏడో నెల మొదలై వారం అయిపోవస్తోంది. ఇంకా సినిమా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో సినిమా ఉంటుందా? లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది.

అయితే సినిమా ఇంతవరకూ వచ్చాక ఆపడం ఈజీయేనా? అనుకున్న ప్రతి సినిమా, ప్రారంభించిన ప్రతి మూవీ పూర్తవ్వాలని లేదు. విడుదలవ్వాలని కూడా లేదు. ముహూర్తపు షాట్‌ కొట్టాక ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అలా ఆగిపోతే వెంటనే వేరే సినిమా మొదలయ్యేలా ఉండాలి. ఇప్పుడు మహేష్‌బాబు దగ్గరకు వచ్చేసరికి ఈ సినిమాను ఆపేస్తే వెంటనే వేరే సినిమా ప్రారంభించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్‌ చేయల్సిన రాజమౌళి సినిమా కథ ఇంకా రెడీ అవ్వేలేదు.

అందులోనూ రాజమౌళి సినిమాకు కథ ఒక్కటి రెడీ అయితే సరిపోదు. ఇంకా చాలా యాస్పెక్ట్స్‌ సిద్ధమవ్వాలి. సాంకేతిక నిపుణులు, కాస్ట్‌ అండ్‌ క్రూ, సెట్స్‌ ఇంకా చాలా పనులు ఉన్నాయి. దీనికి మరో ఏడాది దాటి పడుతుంది అని చెబుతున్నారు. కాబట్టి రాజమౌళి సినిమా ఇప్పట్లో కష్టమే. పోనీ ఈ లోపు త్రివిక్రమ్ సినిమా చేసేద్దామంటే ఆ కథ ఇంకా రెడీ అవ్వడం లేదు. వరుస నెరేషన్లు అవుతున్నా కథ ఇంకా ఫైనల్‌ కావడం లేదు. మొన్నీ మధ్య కూడా కథ చెప్పినా ఇంకా ఫైనల్‌ కాలేదంటున్నారు.

ఒకవేళ మహేష్‌ ఎంతగా ప్రయత్నిస్తున్నా… కథ ఓకే అవ్వడం లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో వేరే దర్శకుడితో సినిమా చేద్దామంటే అగ్ర దర్శకులు ఎవరూ లేరు. సుకుమార్‌, కొరటాల, బోయపాటి.. ఇలా స్టార్‌ దర్శకులు ఎవరూ రెడీగా లేరు. కాబట్టి ఏది ఏమైనా మహేష్‌బాబు ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సిందే. లేదంటే కొత్త దర్శకుడితో సినిమా చేయాలి. ఇంకా లేదంటే ఖాళీగా ఉండాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus