Mahesh Babu: అంత బాధలోనూ ఆదుకున్నావంటే మహేష్ నువ్వు దేవుడివే..!

  • November 18, 2022 / 03:31 PM IST

మనకి వస్తే బాధ.. అదే ఆపద ఎదుటి వాళ్లకి వస్తే బాగా లైట్ తీసుకునే ఈరోజుల్లో.. మాట ఇవ్వడమే గొప్ప అయితే.. ఇచ్చిన మాట మీద నిలబడడం.. మనం ఇబ్బందుల్లో ఉన్నా దాన్ని నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు.. గ్రేట్ అనే మాటే గర్వంగా ఫీలయ్యేంత గ్రేట్ అది.. అచ్చం ఇలానే చేశాడు మహేష్ బాబు.. తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నారని తెలసిన బాధలో ఉండి కూడా ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి..

మరోసారి తన మంచి మనసుని, వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. మహేష్, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్స్‌లో ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ గారు గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయిన రోజునే మరో చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టారు మహేష్.. అసలేం జరిగిందంటే.. ఏపీలోని అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయి (3) కి చిన్నప్పటి నుంచే గుండెలో రంధ్రం ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో.. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

దిక్కుతోచని స్థితిలో వారికి దేవుడికంటే కూడా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన మహేష్ బాబు దేవుడిలా కనిపించారు. వెంటనే మోక్షిత్‌ని తీసుకుని ఆంధ్ర హాస్పిటల్‌కి వచ్చారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు టెన్షన్ అప్పుడే స్టార్ట్ అయింది.. పిల్లాడిని తీసుకొచ్చిన రోజునే, కృష్ణ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు.పిల్లాడి పేరేంట్స్‌కి విషయం తెలిసి షాక్ అయ్యారు.. ఈ పరిస్థితిలో తమ బాబుని పట్టించుకుంటారో లేదోనని కంగారు పడ్డారు..

ఇక అలాంటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది?.. మహేష్ స్థానంలో ఇంకొకరుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ.. పుట్టెడు దు:ఖంలోనూ ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించాడు.. తను అంత బాధలో ఉండి కూడా.. తమ బిడ్డని బతికించిన మహేష్ మాకు నిజంగా దేవుడే అంటూ భావోద్వేగానికి గురయ్యారు మోక్షిత్ తల్లిదండ్రులు. తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నా కానీ మరో చిన్నారి గుండెను కాపాడావ్.. నిన్ను మించిన దేవుడు ఎవరుంటారు అంటూ.. తెలుగు ప్రజలంతా మహేష్ బాబుని అభినందిస్తున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus