Mahesh Babu: ‘ఖలేజా’ సీన్ రిపీట్.. ‘ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటున్న ఊరి జనాలు.!

‘ఖలేజా’ (Khaleja)  సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఓ పాప చనిపోయిందని భావించి ఊరి జనం అంతా బాధపడుతూ ఉంటారు. ఆ టైంలో ఓ ఫైట్ అయ్యాక.. ఆ పాపని మహేష్ బాబు ఎత్తుకోగా.. ఆ పాప లేచి కూర్చుంటుంది. దీంతో ఊరి జనం అంతా అతన్ని దేవుడిలా కొలుస్తుంటారు. క్లైమాక్స్ లో ‘నీ లెక్క తప్పదు సామి.. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అనే డైలాగ్ కూడా ఆ ఊరి పెద్ద మహేష్ తో  (Mahesh Babu)  చెబుతాడు.

Mahesh Babu

ఇప్పుడు ఆ సీన్లు రిపీట్ అయ్యాయి. అవును ఓ ఊరి జనం మహేష్ బాబు గురించి ‘ఖలేజా’ సినిమాలో చూపించినట్టే.. పొగుడుతూ ఓ బ్యానర్ వేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ బాబు (Mahesh Babu) .. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి చాలా మంది పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఆ లెక్క ఇప్పుడు 3772 అయ్యిందట. ఈ విషయాన్ని ఓ ఊరుకి చెందిన జనాలు ఓ బ్యానర్ ద్వారా తెలిపారు. ఆపరేషన్ చేయించుకున్న పాప ఫోటోని కూడా ఆ బ్యానర్లో వేసి..

‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం స్వామి.! నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పనిలేదు. మాకు నమ్మించే అక్కర లేదు. సామీ..! ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ కత్తుల వారి పేట అనే ఏరియాకి చెందిన జనాలు ఈ బ్యానర్ పెట్టడం జరిగింది. ఇక మహేష్ బాబు సర్జెరీ చేయించిన ఆ 3772 కిడ్ ఓ పాప. ఆమె పేరు రిత్విక అని ఆ బ్యానర్లో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీజర్ తో మెప్పించిన నిఖిల్.. మరో భారీ హిట్ ఖాతాలో చేరుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus