Mahesh Babu, Sitara: కూతురి డ్యాన్స్ పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో మహేష్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవర్సీస్ లో సైతం మహేష్ బాబు నటించిన సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయి. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు హీరోగా మహేష్ కు క్రేజ్ ను పెంచగా సర్కారు వారి పాట సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మే 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా సోలోగా తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

Click Here To Watch

మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి ఈ ఏడాదే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనాలని అనుకుంటున్నారు. మహేష్ ప్లానింగ్ ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. సర్కారు వారి పాట సినిమా నుంచి తాజాగా కళావతి వీడియో విడుదలైంది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. మహేష్ కూతురు సితార కూడా కళావతి పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సితార డ్యాన్సింగ్ స్కిల్స్ ను చూసి నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. సితార సినిమాల్లోకి వస్తే స్టార్ స్టేటస్ ను అందుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సితార డ్యాన్స్ గురించి మహేష్ బాబు “మై స్టార్.. నన్ను బీట్ చేసింది” అని చెప్పుకొచ్చారు. సితారకు ఇంతకు మించిన ప్రశంస ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు సితారను మై స్టార్ అని మెచ్చుకోవడం అభిమానులను సైతం ఫిదా చేస్తోంది. సితార సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది. సితార సోషల్ మీడియాలో మాత్రం తన క్రేజ్ తో అభిమానులను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus