సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతో మందిని అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా కృష్ణ ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహాన్ని చివరిసారిగా చూస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే కృష్ణ గారు మరణించడంతో ఎంతో మంది అభిమానులు కృష్ణ గారి సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.
అదేవిధంగా గతంలో తన తండ్రి కృష్ణ గారి గురించి మహేష్ బాబు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ను ప్రస్తుతం అభిమానులు గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ సినిమా విడుదల సమయంలో మహేష్ బాబు కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా కృష్ణ గారి బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ తాను అలాంటి ఆలోచనలో లేదని అయితే
ఎవరైనా నాన్నగారి బయోపిక్ చేస్తే ముందుగా సంతోషపడి తన సినిమా చూడటానికి వెళ్లే వ్యక్తి తానేనంటూ మహేష్ బాబు వెల్లడించారు. ఆయన నా దేవుడు అంటూ అప్పట్లో మహేష్ బాబు తన తండ్రిని ఏకంగా దైవ సమానంగా భావించారు. ఇలా తండ్రిని దేవుడిగా భావించిన మహేష్ బాబుకు ప్రస్తుతం ఆ దేవుడు దూరం కావడంతో ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కృష్ణ తన సినిమాలలో మహేష్ బాబును బాల నటుడిగా మహేష్ బాబుని ఎంపిక చేసుకోవడమే కాకుండా రాజకుమారుడు
సినిమా ద్వారా తనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మహేష్ బాబు మొదట్లో సినిమాల ఎంపిక విషయంలో తన తండ్రి సహాయం చేస్తున్నప్పటికీ అనంతరం కృష్ణ గారు తన కథలను తానే ఎంపిక చేసుకోవాలని సూచించారట.ఈ విధంగా మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎంతో కీలకపాత్ర పోషించిన కృష్ణ గారు మరణించడం మహేష్ బాబును తీవ్ర శోకసంద్రంలోకి ముంచింది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!