మహేష్ ‘చార్లీ’ సుధీర్ బాబే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మరో పక్క మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు.ఇక ‘జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానేర్ ను స్థాపించి ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు తన సొంత బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి కూడా రెడీ అవుతున్నాడని గత కొంతకాలంగా వార్తలోస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన నిర్మాణ బాధ్యతల్ని మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటారని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ కు ‘చార్లీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి రచయితగా పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇందులో 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట… అంతా కొత్త వారినే ఈ వెబ్ సిరీస్ లో తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బావ అయిన సుధీర్ బాబు ‘ఛార్లీ’ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాడట. మహేష్ నిర్మాత కావడం స్క్రిప్ట్, యాక్టింగ్ కి కూడా స్కోప్ ఉండే పాత్ర కావడంతో సుధీర్ వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇప్పుడు సుధీర్ పేరు బయటకి రావడంతో ‘చార్లీ’ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ వెబ్ సిరీస్ ను ‘నెట్ ఫ్లిక్స్’ లేదా ‘అమెజాన్ ప్రైమ్’ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే.. మరో పక్క ఇలా ‘వెబ్ సిరీస్’ లు ప్లాన్ చేయడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా… కొందరు కొత్త నటీనటుల్ని కూడా పరిచయం చేయడం మహేష్ ని అభినందించ తగ్గ విషయం అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus