మహేష్ షర్ట్ లెస్ ఫోటో వైరల్..!

లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలు అంతా ఇళ్ళకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో కొంత మంది బయట కూడా తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చే మహేష్ బాబు మాత్రం.. తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించాడు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ లోని కొత్త కొత్త ట్యాలెంట్ బయటపడుతుందనే చెప్పాలి. మొన్నటికి మొన్న తన కూతురు సితార కోసం ఓ పాట పాడాడు మహేష్. అతనిలో సింగర్ కూడా ఉన్నాడని ఫ్యాన్స్ తెగ పొగిడేసారు.

ఎప్పటికప్పుడు తన కుటుంబంతో గడుపుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు మహేష్.. తన ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఫోటోని విడుదల చేసాడు. ఈ ఫోటోలో మహేష్ షర్ట్ లేకుండా ఉండడం విశేషం. మహేష్ భార్య నమ్రత ఈ ఫోటోని తీసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. మహేష్ తన కూతురు సితార తో స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఆడుకుంటున్నప్పుడు ఈ ఫోటో తీసినట్టు తెలుస్తుంది.

ఇప్పటి వరకూ మహేష్ తన సినిమాల్లో షర్ట్ లేకుండా కనిపించలేదు. ‘1 నేనొక్కడినే’ సినిమాలో తన వీపు చూపిస్తూ ఉండే షాట్ ఉంది. ఇప్పుడైతే షర్ట్ లెస్ గా కనిపించాడు. మహేష్ బాబు కూడా ఓ ట్రైనర్ ను పెట్టుకుని జిమ్ చేస్తూనే ఉంటాడు. 44 ఏళ్ళ వయసులో కూడా ఫిట్ గా ఉండడానికి ఎన్నో వర్కౌట్ లు చేస్తుంటాడు. మరి పూర్తిస్థాయిలో 6 ప్యాక్ బాడీని ఎప్పుడు చూపిస్తాడో చూడాలి. బహుశా రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలోనే అది సాధ్యం అవుతుందేమో.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus