ఇటీవల భారీ నిర్మాణ సంస్థలు ఉన్న బ్యానర్ లో చిన్న సినిమాలు చేయలేక.. అనుబంధ సంస్థగా మరో బ్యానర్ ను మొదలెడుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ ఈ విధానానికి తెరలేపింది. 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు రూపొందించడానికి “గీతా ఆర్ట్స్ 2” అనే బ్యానర్ ను స్థాపించి అందులోనే “భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా” లాంటి చిత్రాలు నిర్మించింది. ఆ ప్రొసెస్ ను యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్, 14 రీల్స్ లాంటి సంస్థలు ఫాలో అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ మహేష్ బాబు “ఎం.బి కార్ప్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తాను నటించే చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ సంస్థకు అనుబంధ సంస్థగా మరో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఆ బ్యానర్ లో చిన్న సినిమాలు రూపొందించే ప్లాన్ లో ఉన్నాడట మహేష్. ఆల్రెడీ నమ్రత వెబ్ సిరీస్ లు రూపొందించడానికి సిద్ధమవుతున్న తరుణంలో మహేష్ ఇలా చిన్న సినిమాలు రూపొందించడానికి రంగం సిద్ధం చేసుకోవడం అనేది అభినందించదగిన విషయం.