మహేష్ బాబుకు సినిమా, ఇల్లు ఇవే ప్రపంచం. మిగతా వాటిని పట్టించుకోరు. రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. అయితే ఇప్పుడు మహేష్ రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ కోసం కాదు. సినిమా కోసం. ప్రస్తుతం మహేష్ చేస్తున్న స్పైడర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తిగా పొలిటికల్ డ్రామా. లండన్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి.. ఇక్కడి అవినీతిని చూసి భరించలేక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ప్రజల మనసు గెలుచుకొని సీఎం అవుతాడు. ఇది సూక్ష్మంగా కథ. ఈ సినిమా కోసం రాజకీయం నాయకుల హావభావాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
“భరత్ అను నేను” అనే టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్లో జరుగుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ భవంతి సెట్లో మహేశ్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలను మాస్టర్ జాయ్ పై తీస్తున్నారు. భరత్ తల్లిదండ్రుల పాత్రలను సితార, శరత్ కుమార్ పోషిస్తున్నారు. దీని తర్వాత జూన్ 16 నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. ఆ షెడ్యూల్లో మహేష్ పాల్గొననున్నారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.