Mahesh Babu, Trivikram: మహేష్ 28…నెక్స్ట్ లెవెల్ మాస్ .. అస్సలు ఊహించరట!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ కాంబోలో అతడు వంటి డీసెంట్ హిట్, ఖలేజా వంటి డిజాస్టర్ వచ్చాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో అంతగా సక్సెస్ అయ్యింది లేదు. కానీ టీవీల్లో మాత్రం రెండూ బ్లాక్ బస్టర్లే. ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు. అతడు లో మహేష్ చాలా సెటిల్డ్ గా కనిపిస్తాడు. ఎక్కువ డైలాగులు ఉండవు.

మాట కూడా వనుకుతున్నట్టు వస్తుంది. కానీ అతను పలికే డైలాగ్ లు సుదుల్లా గుచ్చుకుంటాయి.సినిమా చూశాక కూడా ఆ డైలాగులు మనల్ని వెంటాడతాయి. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రంలో పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు మహేష్. డైలాగులు ఫాస్ట్ గా చెబుతాడు . బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాలో డైలాగులు అంటే ప్రాసలు, పంచ్ లు మాత్రమే ఉంటాయి అనుకున్న ఆడియన్స్ మహేష్ పలికే డైలాగులు చూసి స్టన్ అయిపోయారు.

త్రివిక్రమ్ లో ఉన్న మాస్ యాంగిల్ ను మహేష్ (Mahesh Babu) ద్వారా బయటపెట్టాడా అనిపిస్తూ ఉంటుంది. మరి వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతుంది.ఈ పాత్రని త్రివిక్రమ్ ఎలా డిజైన్ చేయబోతున్నాడు అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మహేష్ కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి డైలాగులు పలుకుతాడట. ఇది ఖలేజా ని మించిన మాస్ రోల్ అని తెలుస్తుంది. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్ ను అందిస్తారో చూడాలి.l

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus