రెండో సినిమాకే బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై..!

అక్కినేని నాగార్జున హీరోగా రాబోతున్న యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’.’మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ బ్యాన‌ర్ ‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించింది. నిజంగానే ఈ చిత్రం కనుక హిట్ అయితే ఈ దర్శకుడికి నెక్స్ట్ ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టే..! అవును ‘వైల్డ్ డాగ్’ కనుక హిట్ అయితే ఏకంగా దర్శకుడు సాల్మన్ కు మహేష్ బాబుతో మూవీ చేసే అవకాశం దక్కుతుంది.

ఈ మధ్యనే మహేష్ ను కలిసి కథ కూడా వినిపించాడట. మహేష్ కు అది నచ్చింది. బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పాడట. అంతేకాదు 2 నెలల్లో ప్రాజెక్టుని ఫినిష్ చేసేలా స్క్రిప్ట్ రెడీ చేసుకోమని కూడా చెప్పాడట. ఇప్పుడు సాల్మన్ అదే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ‘వైల్డ్ డాగ్’ చిత్రం కనుక హిట్ అయితే మహేష్ తో సినిమా 70 శాతం కన్ఫర్మ్ అయిపోయినట్టే..! ఇక స్క్రిప్ట్ కూడా మహేష్ ను మెప్పించి 2 నెలల్లో ఫినిష్ అయ్యేలా ఉంటే.. కచ్చితంగా ఈ ప్రాజెక్టు ఖరారయ్యే అవకాశం ఉందనే చెప్పాలి.

మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రానికి సాల్మన్ రైటర్ గా పనిచేసాడు. అప్పటి నుండీ మహేష్ తో మంచి సాన్నిహిత్యాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు సాల్మన్. రాజమౌళితో సినిమా మొదలుపెట్టే లోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చెయ్యాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే తక్కువ టైములో సినిమాలు ఫినిష్ చేసే యంగ్ డైరెక్టర్ల వైపే దృష్టి పెడుతున్నాడు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus