Mahesh Babu: సర్కారు ప్రమోషన్స్ ను అలా ప్లాన్ చేశారా?

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కావడానికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లానింగ్ మాత్రం అదుర్స్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సర్కారు వారి పాట విడుదలైన తర్వాత మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఈ ఏడాది జూన్ లో మొదలై డిసెంబర్ నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 10వ తేదీ నాటికి సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో పాల్గొని మహేష్ బాబు ఇంటర్వ్యూ, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది. సర్కారు వారి పాట విడుదలైన తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది.

ఒకవైపు కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తూనే మరోవైపు వరుస విజయాలు సాధించేలా మహేష్ బాబు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల డైరెక్టర్లు కూడా మహేష్ బాబుతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి సినిమాతో మహేష్ బాబుకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

మహేష్ బాబు గత మూడు సినిమాలు సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో సర్కారు వారి పాట సినిమాకు సైతం రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా ఆంధ్ర హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నైజాం హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. గీతా గోవిందం సినిమాతో సక్సెస్ సాధించిన పరశురామ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సాధించాల్సి ఉంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus