Mahesh Babu: తండ్రి పుట్టిన రోజున ఆ సినిమా అప్డేట్ ఇవ్వనున్న మహేష్ బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు.ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోంది? సినిమా టైటిల్ ఏంటి అనే విషయాల గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మహేష్ బాబు సినిమాల టైటిల్ విషయంలో ఎలాంటి సస్పెన్స్ ఉండదు.ఈయన నటించిన సినిమాలకు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభించకుంటున్న నేపథ్యంలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బిగ్ సర్ ప్రైస్ ఇవ్వనున్నట్లు సమాచారం.అయితే మే 31వ తేదీ కృష్ణ తన పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమా త్వరలోనే

సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో తన సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజును ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ క్రమంలోనే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు తన 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus