మహేష్ నెక్స్ట్ మూవీలో సరికొత్త మేకోవర్ తో రానున్నాడట

టాలీవుడ్ లో క్రేజీ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలందరూ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారు. దేశముదురు సినిమాతో అల్లు అర్జున్ ఎప్పుడో ఈ లీగ్ లోకి ఎంటర్ కాగా ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ బాడీలో దర్శనం ఇచ్చారు. ఈ తరం స్టార్ హీరోలలో ఆ ప్రయోగం చేయనిది ఒక్క మహేషే. ఆయన ఇంత వరకు చొక్కా విప్పింది లేదు. 2014లో సుకుమార్ తో చేసిన నేనొక్కడినే చిత్రం కోసం సిక్స్ ప్యాక్ చేశాడని వార్తలు వచ్చినా మహేష్ పూర్తి స్థాయిలో ప్రదర్శించింది లేదు.

టెంపర్ సినిమాతో సిక్స్ ప్యాక్ క్లబ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పిక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ స్పూర్తితో మహేష్ తన నెక్స్ట్ మూవీలో సిక్స్ ప్యాక్ బాడీలో రెచ్చిపోనున్నాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ మధ్య మహర్షి సినిమా టైంలో మహేష్ ఫిట్నెస్ ట్రైనర్ గా పని చేసిన గాబ్రియేల్ ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ తో కలిసి పనిచేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు.

ఇక పరుశురామ్ తో ఆయన చేస్తున్న నెక్స్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. ఈ గ్యాప్ లో మహేష్ సిక్స్ ప్యాక్ ట్రై చేయవచ్చు. మరి ఇదే కనుక జరిగితే మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం. అలాగే వరుసగా మహేష్ క్రేజీ ఫిల్మ్స్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ అనంతరం రాజమౌళితో మూవీ చేస్తున్నట్లు ప్రకటన రాగా, ఆ మూవీ మొదలయ్యే లోపు మరో చిత్రం మహేష్ పూర్తి చేయనున్నాడు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus