Mahesh Babu: గౌతమ్ మరింత ఎత్తుకు ఎదగాలి.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి (SS Rajamouli) సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ లెవెల్ లో సరికొత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటారని జక్కన్న ఈ సినిమాతో తన సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు కొడుకు గురించి పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. కొడుకు సక్సెస్ చూసి గర్వంతో పొంగిపోతున్నానని మహేష్ బాబు కామెంట్లు చేశారు.

గౌతమ్ ఇంటర్మీడియట్ పూర్తి చేయడంతో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తాను గర్వంతో పొంగిపోతున్నానని తన కొడుకు లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. గౌతమ్ కలలను అందుకునేందుకు పరుగెత్తాలని తాను తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానని మహేష్ బాబు అన్నారు. మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోల వల్ల ఆయన లుక్ కూడా రివీల్ అయిందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గౌతమ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడంతో పాటు భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సినిమాలకు సంబంధించి గౌతమ్ మదిలో ఏముందో తెలియాల్సి ఉంది. 1 నేనొక్కడినే సినిమాలో నటించి తన నటనతో మెప్పించిన గౌతమ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని మేకర్స్ నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం మూడు సంవత్సరాల ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. మహేష్ బాబు లుక్ సైతం సినిమాలో అదుర్స్ అనేలా ఉండనుందని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus