Mahesh Babu, Keerthy Suresh: కీర్తి గురించి మహేష్‌ బాబు ఏం అన్నారంటే..?

హీరో హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరితే సగం సినిమా హిట్‌ అయినట్లే అని చెబుతుంటారు మన సినిమా పెద్దలు. హిట్‌ సినిమాలు చూస్తే అందులో కీలకంగా ఉండే పాయింట్‌ ఈ కెమిస్ట్రీనే. అది ప్రేమకథ కాకపోయినా కెమిస్ట్రీ అయితే పక్కాగా కుదరాల్సిందే. అప్పుడే మంచి మజా వస్తుంది. మహేష్‌బాబు లేటెస్ట్‌ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ ఇలాంటి కెమిస్ట్రీనే ఉండబోతోంది అంటున్నారు. వారిద్దరి మధ్య ట్రాక్‌ చూసి అభిమానులు మురిసిపోతారు అని అంటున్నారు దర్శకుడు.

ఆ మాటకొస్తే కీర్తి సురేశ్‌తో ట్రాక్‌ గురించి మహేష్‌బాబు కూడా ఇంచుమించు ఇలాగే చెబుతున్నారు. సినిమా ఫస్టాఫ్‌లో సుమారు 45 నిమిషాలపాటు కీర్తి సురేశ్‌తో వచ్చే మా ట్రాక్‌ అదిరిపోతుంది అని చెప్పాడు మహేష్‌. ఆ సమయంలో థియేటర్‌లో ఫ్యాన్స్‌ ఊగిపోతారు అని చెప్పాడు మహేష్‌. ఆ సీన్స్‌ విషయంలో చాలా ఎంజాయ్‌ చేసి వర్క్‌ చేశా అని కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు అని కూడా చెప్పాడు.

ట్రైలర్‌ చూసినప్పుడు అందరూ అదే ఫీలయ్యారు అని కూడా గుర్తు చేశాడు. మహేశ్‌ బాబును ఆరు ఏళ్లుగా ఇలా చూడలేదనుకున్నారు. అందుకే అందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ క్రెడిట్‌ మొత్తం పరశురామ్‌కే దక్కుతుంది అని కూడా చెప్పారు మహేష్‌. సినిమాను, అలాగే కీర్తి సురేశ్‌ కాంబినేషన్‌ సీన్స్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు అంటూ తన దర్శకుడిని ఆకాశానికెత్తేశాడు మహేష్‌. ఇప్పటికే ట్రైలర్‌లో ఆ సీన్స్‌ వైబ్‌ కనిపిస్తోంది. మహేష్‌ కుర్రాడిలా మారిపోయి సూపర్‌గా చేశాడంటున్నారు ఫ్యాన్స్‌.

మరి కీర్తి సురేశ్‌కి ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏం ఇస్తారు అని మహేష్‌బాబును అడిగితే… అయ్యో మహానటికి ఏం సలహా ఇస్తాం అంటూ తనదైన శైలిలో సెటైరికల్‌ ఆన్సర్‌ ఇచ్చారు మహేష్‌. ఆ తర్వాత మరో ప్రశ్నకు సమాధానంగా ఫ్యాషన్‌ మినిస్టరీని కీర్తి సురేశ్‌ అండ్‌ టీమ్‌కి ఇస్తానని చెప్పారు దర్శకుడు పరశురామ్‌. మహేష్, పరశురామ్‌ చెబుతున్న దాని ప్రకారం చూస్తే ‘సర్కారు వారి పాట’ కీర్తి ఆట అదిరిపోవడం పక్కా అని చెప్పొచ్చు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus