Mahesh Babu, Ramya Krishna: మహేష్ – రమ్యకృష్ణ…ల రొమాంటిక్ సాంగ్ వైరల్.!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతంలో ఈ కాంబోలో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాలు వచ్చాయి. కాబట్టి. ‘గుంటూరు కారం’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ మహేష్ అభిమానులను, మాస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. ‘గుంటూరు కారం’ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ.. హీరో మహేష్ బాబుకు తల్లి పాత్రలో కనిపించనుంది. ట్రైలర్లో కూడా ఆమె కనిపించింది. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది అని క్లారిటీ వచ్చేసింది. ‘కీర్తి కిరీటాలు’ అనే నవల ఆధారంగా ఆమె పాత్ర డిజైన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. మహేష్, రమ్యకృష్ణ ..ల గురించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. 2004లో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘నాని’ అనే సినిమా వచ్చింది. ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించింది. మహేష్ బాబుకి, రమ్యకృష్ణ.. కి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఇందులో ఉంటుంది. ‘మార్కండేయ’ అంటూ సాగే ఈ పాటని తర్వాత.. సినిమాలో డిలీట్ చేయడం కూడా జరిగింది.

అయితే యూట్యూబ్లో అందుబాటులో ఉండటంతో నెటిజన్లు ఈ పాట గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. ‘అప్పుడు మహేష్ తో రొమాన్స్ చేసి.. ఇప్పుడు తల్లిగా చేస్తుంది రమ్యకృష్ణ’ అని అంటున్నారు. ‘కానీ సినిమాల్లోని పాత్రలని ఇలా పర్సనల్ గా తీసుకోకూడదు’ అంటూ మరి కొంతమంది అంటున్నారు. గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ప్రేక్షకులు చూశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus