ఒక్కో యాడ్ కి కోట్లలో రెమ్యునరేషన్!

తెలుగు హీరోలలో బ్రాండ్ డీల్స్‌తో అత్యధికంగా సంపాదించేది మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియాలో మహేష్ కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా పలు సంస్థలు అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటూనే వున్నాయి. ఈ యాడ్స్‌తోనే మహేష్ ఏడాదికి భారీ ఆదాయం కూడగడుతున్నారు. థమ్స్అప్ లాంటి యాడ్ కోసం స్టంట్ లు కూడా చేస్తున్నాడు మహేష్. అయితే వీటికోసం మహేష్ ఎంత రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తాడనే విషయం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

యాడ్ ఏజెన్సీలు మహేష్ వెంట పడి మరీ ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటూ.. ఒక్కో యాడ్ కి రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు చెల్లిస్తున్నారట. చిన్న హీరోలే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే.. మహేష్ లాంటి స్టార్ హీరోకి ఈమాత్రం చెల్లించడంలో తప్పు లేదని భావిస్తున్నాయి కార్పొరేట్ కంపనీలు. మహేష్ క్రేజ్ తమ వస్తువుల విలువను పెంచేస్తుండడంతో.. మహేష్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి యాడ్ ఏజెన్సీలు.

ప్రస్తుతం మహేష్ థమ్స్అప్ యాడ్ తో పాటు.. సంతూర్, బైజూస్, డెన్వర్ లాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాడ్స్ అన్నింటికీ కూడా మహేష్ కి రెమ్యునరేషన్ కోట్లలోనే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫ్లిప్ కార్ట్ కు కూడా బ్రాండింగ్ చేస్తున్నారు మహేష్. దీనికోసం కూడా మహేష్ కి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus