ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు… ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి అందరినీ గజగజ వణికిస్తుంది. 3 వారాల లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ … ఇంకా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీస్ లు … ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా దీనిని కట్టడి చెయ్యాలి అని భావించినా.. వర్కౌట్ కావడం లేదు. ఇలాంటి తరుణంలో లాక్ డౌన్ పెంచాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ భావిస్తున్నట్టు తాజాగా తెలిపారు.
ఇప్పుడు జనాలకు చిన్న జలుబు వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు. అంతేకాదు కరోనా మెడిసిన్ వచ్చేసింది అంటూ.. వచ్చే వార్తలను కూడా ఫార్వర్డ్ చేసేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటున్నాడు మహేష్. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మహేష్ బాబు కరోనా బాధితుల సహాయార్ధం… 50 లక్షల వంతున రూ. కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు మహేష్. మరోవైపు కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం కూడా రూ.25 లక్షల విరాళం అందించాడు.
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను … ఫ్యామిలీతో గడుపుతున్నాను అంటూ మహేష్ చెప్పు కొచ్చాడు.కరోనాను ఎదుర్కోవడానికి ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, మీడియా, ప్రభుత్వాలు అలుపెరగకుండా చేస్తోన్న పనులను అభినందించాడు మహేష్. ఇలాంటి టైములో కరోనా మెడిసిన్ అంటూ వచ్చే ఫేక్ న్యూస్ లను నమ్మకండి… అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.