SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ ను అలా చూపించనున్నారా?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనా ఆ అంచనాలకు తగిన స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయాయి. అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కే మూడో సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమాను క్లాస్ సినిమాగానే తెరకెక్కిస్తారని అయితే ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తైంది. మహేష్ తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తుండటంతో మహేష్ బాబు అభిమానులు సైతం సంతోషిస్తున్నారు. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో పది రోజుల తర్వాత ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. ఇతర భాషల నటీనటులకు సైతం ఈ సినిమాలో ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించే ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus