సంక్రాంతి అంటేనే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే సంక్రాంతి పండుగ మహేష్ బాబుకి హిట్ సెంటిమెంట్ గా కూడా మారిందనే విషయం మనకు తెలిసిందే.
గతంలో కూడా ఈయన నటించిన పలు సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల కాగా ఎక్కువ సినిమాలు సక్సెస్ అందించాయి. మరి మహేష్ బాబు నటించిన ఏ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి ఏ సినిమాలు హిట్ అందుకున్నాయనే విషయానికి వస్తే.. 2002వ సంవత్సరంలో మహేష్ బాబు కౌబాయ్ నటించినటువంటి టక్కరి దొంగ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత 2003 సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కడు సినిమా ద్వారా మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మహేష్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 2012వ సంవత్సరంలో బిజినెస్మెన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2014 సంక్రాంతికి మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
టక్కరి దొంగ సినిమా తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) సంక్రాంతికి విడుదల చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక అనంతరం 2020వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హీట్ అందుకుంది ప్రస్తుతం గుంటూరు కారం సినిమా ద్వారా మరోసారి రాబోతున్నారు. ఇప్పటివరకు ఈయన ఆరు సినిమాలను విడుదల చేయగా ఇందులో నాలుగు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.