ఎక్స్ మెన్ లాంటి ఫేమస్ ఫ్రాంఛైజీలో నటించిన హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు .. మురుగదాస్ లాంటి వాళ్లు లండన్ లో దిగితే తనతో లంచ్ కి రావాల్సింది గా కోరాడు. కలిసి ఓ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ తీద్దామని వ్యాఖ్యానించారు. దాంతో ఇదే విషయాన్ని మహర్షి ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తే మహేష్ సైలెంట్ గా అదిరిపోయే పంచ్ వేశారు. “ఆయన ఖాళీగా ఉన్నాడేమో.. అందుకే ట్వీట్లు చేస్తున్నాడని చెప్పి సరదాగా నవ్వేసారు. మహేష్ మొదటి ప్రాధాన్యత తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత వీలుంటే ఇరుగు పొరుగుపై దృష్టి సారిస్తారు.
ఇకపోతే.. అసలెప్పుడు తన ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు “మహర్షి” సినిమా కోసం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను చేసిన తప్పులను కూడా రియలైజ్ అవ్వడం, తప్పుల నుంచి తాను నేర్చుకున్న విషయాలను పంచుకోవడం ఒక వ్యక్తిగా మహేష్ లో ఎంతో పరిణితి వచ్చింది అనేందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మే 9న విడుదలవుతున్న “మహర్షి” తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎంతో కాన్ఫిడెన్స్ తో మాటిచ్చాడు మహేష్.