‘డియరెస్ట్ మహేష్ … ‘ఆచార్య’ లో ‘పాద ఘట్టం’ ని మీ మనోహరమైన స్వరంతో పరిచయం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా మూవీలో భాగమైనందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను! అభిమానులు అలాగే ప్రేక్షకులు మీ మాట వినడానికి చాలా థ్రిల్ ఫీలవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాకు, రాంచరణ్ కు మీ వాయిస్ ఓవర్ చాలా బాగా నచ్చింది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాసుకొచ్చారు.
‘ఆచార్య’ లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఉంటుందని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ‘ఆచార్య’ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘ఆచార్య’ సినిమా మహేష్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది అని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చారు. ‘ప్రేక్షకుల్ని రెండు నిమిషాల్లో ‘ఆచార్య’ ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. ఆ రెండు నిమిషాల్లోనే కథలో ఇన్వాల్వ్ అవ్వాలి. అంత హానెస్ట్ వాయిస్ ఎవరికి ఉందా అని ఆలోచిస్తే నాకు మహేష్ గారు గుర్తుకొచ్చారు.
ఆయన్ని అడగ్గానే ఓకె చెప్పేసారు. ఒకసారి కథ చెప్పమంటారా? అని అడిగాను.. అవసరం లేదండీ మీ పై, మీ డైరెక్షన్ పై నాకు నమ్మకం ఉంది అంటూ ఆయన ఓకె చెప్పారు.’ అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు. ఇక ‘ఆచార్య’ లో రాంచరణ్ కూడా సిద్ద అనే పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అతనికి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసింది. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కాబోతుంది.
Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!