Mahesh Babu: మీ వారసత్వాన్ని కొనసాగిస్తా.. గర్వపడేలా చేస్తా నాన్న.. మహేష్ పోస్ట్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ ఈనెల 15వ తేదీ అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇలా కృష్ణా మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో షాక్ కి గురైంది. ఇక తండ్రి మరణంతో మహేష్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.కేవలం నేలన్నర వ్యవధిలోని మహేష్ బాబు తల్లి తండ్రిని కోల్పోవడంతో ఈయన దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక తన తండ్రి అంత్యక్రియలను, ఆయనకు నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ మహేష్ బాబు నిర్వర్తించారు.

ఇకపోతే తన తండ్రి మరణం తర్వాత మహేష్ బాబు మొదటిసారి సోషల్ మీడియా వేదికగా తన తండ్రి గురించి ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన తండ్రి ఫోటోని షేర్ చేసి.. మీరు మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు. ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా గడిపారు ధైర్యం సాహసం మీ వ్యక్తిత్వం.

ఈ విధంగా మీ నుంచి నాకు స్ఫూర్తి కలిగిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. ఇప్పుడు నాలో ఎలాంటి భయాలు లేవు ఇంతకుముందు ఎప్పుడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీ కాంతి ఎల్లప్పుడు నాలోనే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా మీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటానని… మీరు మరింత గర్వపడేలా చేస్తానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

ఇలా తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ చివరిలో లవ్ యు నాన్న..మై సూపర్ స్టార్ అంటూ లవ్ సింబల్స్ తో తన తండ్రి గురించి మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెలన్నర వ్యవధిలోనే తాను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోవడంతో మహేష్ ఎంతగానో కృంగిపోయారు.తన తల్లిదండ్రుల మరణ వార్త నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ ఇంకా బయటపడలేదని తెలుస్తుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus