Mahesh Babu: బాలీవుడ్ సినిమాలపై మహేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రిన్స్ మహేష్ బాబు 46 సంవత్సరాల వయస్సులో కూడా కాలేజ్ కుర్రాడిలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మార్కెట్ ను పెంచుకున్న మహేష్ మరికొన్ని రోజుల్లో సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సర్కారు వారి పాట వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. థమన్ ఈ సినిమాకు అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మహేష్ బాబు క్విక్ ఆన్ అనే ప్రోగ్రామ్ కు గెస్ట్ గా హాజరు కాగా ఈ ప్రోగ్రామ్ లో మహేష్ కు డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఇచ్చిన జవాబు నెట్టింట వైరల్ అవుతోంది.

తాను హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదని మహేష్ బాబు అన్నారు. ప్రస్తుతం తాను టాలీవుడ్ సినిమాలను చేయడానికి కమిట్ అయ్యాయని మహేష్ చెప్పుకొచ్చారు. త్వరలో తాను రాజమౌళితో సినిమా చేస్తున్నానని ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని మహేష్ కామెంట్లు చేశారు. డైరెక్ట్ హిందీ సినిమా చేసే ఆలోచన లేదంటూ మహేష్ బాబు ఒకింత షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారనే చెప్పాలి. మహేష్ రాజమౌళి కాంబోలో సినిమా చాలా సంవత్సరాల క్రితమే ఫిక్స్ అయింది.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుండగా ఎట్టకేలకు ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుండగా రాజమౌళి మహేష్ ను ఏ విధంగా చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus