Mahesh Babu: సితారపై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్!

ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారకు సోషల్ మీడియాలో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గౌతమ్ ఇప్పటికే 1 నేనొక్కడినే సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకోగా సితార కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Click Here To Watch

నిన్నటినుంచి బాలయ్య హోస్ట్ గా మహేష్ గెస్ట్ గా హాజరైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ టాక్ షోలో మహేష్ మాట్లాడుతూ తాను సినిమాలలో యాక్ట్ చేస్తానని స్కూల్ లో ఎవరికీ చెప్పలేదని అన్నారు. ఎవరికైనా చెబితే తెలుగు సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నావా అని టీజ్ చేసేవాళ్లని మహేష్ బాబు వెల్లడించారు. చిన్నప్పుడు సెలవుల్లో నాన్న ఏదో ఒక సినిమాలో తనతో యాక్టింగ్ చేయించేవారని మహేష్ అన్నారు.

సమ్మర్ లో నాన్న సినిమాల షూటింగ్ ఊటీలో జరిగేదని తాను చిన్నప్పుడు నాన్నతో కలిసి నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయని మహేష్ బాబు వెల్లడించారు. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన నీడ తను నటించిన తొలి సినిమా అని తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో చైల్డ్ స్టార్ అయ్యాడని తనపై కామెంట్లు వచ్చాయని మహేష్ తెలిపారు. మహేష్ బాబు డీసెంట్ అనుకుంటే గౌతమ్ డీసెన్సీ కా బాప్ అని బాలయ్య చెప్పగా మహేష్ నవ్వారు.

బాలయ్య ప్రశ్నకు గౌతమ్ క్యాట్ అని సితార బ్రాట్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సితార అమ్మ పోలిక అని కానీ తాట తీసేస్తుందని మహేష్ కామెంట్లు చేశారు. వెకేషన్ ప్లాన్ చేసుకొని క్యాన్సిల్ అయితే గౌతమ్ రియాక్షన్ సాధారణంగా ఉంటుందని సితార వెకేషన్ అంటే ఎగ్జైటింగ్ గా ఉంటుందని క్యాన్సిల్ అయితే ఇల్లు పీకి పందిరి వేస్తుందని మహేష్ చెప్పుకొచ్చారు. సితార ఎక్కువగా అలుగుతుందని సితార అంటే మాట్లాడలేమని వింటే వింటుంది లేదా వినదు అంటూ మహేష్ సితారపై షాకింగ్ కామెంట్లు చేశారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus