హీరోయిన్ కాజల్ కి మహేష్ క్రేజీ ప్రపోజల్..?

మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట పై భారీ అంచనాలున్నాయి. మహేష్ ని దర్శకుడు పరుశురామ్ సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తుండగా, విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్స్ కి భారీ ఆదరణ దక్కింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, మోసాలు ఆధారంగా మంచి కమర్షియల్ అంశాలు జోడించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించనున్నారట. సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ నుండి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

కాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ మాస్ ఐటెం సాంగ్ ని దర్శకుడు సెట్ చేశాడట. ఈ ఐటెం సాంగ్ లో మహేష్ పక్కన స్టెప్స్ వేసే హీరోయిన్ కోసం దర్శకుడు హీరోయిన్ కోసం వెతుకుతున్నాడట. ఐతే ఈ ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ కాజల్ ని తీసుకోవాలి అని అనుకుంటున్నారట.

ఈ విషయంపై మాట్లాడానికి స్వయంగా మహేష్ కాజల్ కి ఫోన్ చేశాడని సమాచారం. కాజల్ కూడా ఈ ఆఫర్ కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కాజల్ ఎన్టీఆర్ తో ‘నేను పక్కా లోకల్’ అనే ఐటెం సాంగ్ లో నటించడం జరిగింది. మరి ఈ వార్తపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus