సూపర్ స్టార్ ని ఆశ్చర్యపరిచిన గుజరాతీలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో, ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నమూవీ ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వంద కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరుగుతోంది. నార్త్ ఇండియాలో తెలుగు నటులకు పెద్దగా ఫాలోయింగ్ ఉండదని భావించిన చిత్ర యూనిట్ కి గుజరాతీలు షాక్ ఇచ్చారు. మహేష్ బాబుని చూసేందుకు షూటింగ్ లొకేషన్ కి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆటోగ్రాఫ్, సెల్ఫీ ల కోసం ఎగబడ్డారు. వారిని చూసి సూపర్ స్టార్ ఆశ్చర్యపోయారు.

అక్కడి తెలుగు వారు ఆప్యాయంగా పలకరించేసరికి ఆనందపడ్డారు. అభిమానులతో కాసేపు మాట్లాడి, వారికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చి చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా కనిపిస్తోందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా  ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య కనిపించనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా ప్రిన్స్ సరసన ఆడి పాడనుంది.  హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి ఫస్ట్ న విడుదల చేయాలనీ    మురుగ దాస్ భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus