పుట్టినరోజున అభిమానులకు రెండు కానుకలు ఇవ్వనున్న మహేష్ బాబు

భరత్ అనే నేను తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరిగింది. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో మొదలుకానుంది. నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో సాగనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ పేరుపై కొన్ని రోజులుగా చర్చ సాగింది. అయితే వంశీ పోస్ట్ చేసిన అక్షరాలను బట్టి మహేష్ 25 వ మూవీ టైటిల్ రిషి అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అందులో ఎంతవరకు నిజముందో.. మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఎందుకంటే మహేష్ బాబు పుట్టినరోజు (ఆగష్టు 9వ తేదీ) సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు రాత్రి డేట్ మారుతుండగానే .. అంటే 9వ తేదీ రాగానే 12 గంటల 06 నిమిషాలకి మహేష్ 25 వ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఉదయం 9 గంటల 09 నిమిషాలకి టీజర్ ను విడుదల చేయనున్నారు. ఒకే రోజున ఫస్టులుక్ .. టీజర్ లను రిలీజ్ చేస్తూ అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేయనున్నారు. తమ అభిమాన హీరో సినిమా పేరు ట్రెండ్ సృష్టించాలని మహేష్ అభిమానులు నిద్రపోకుండా ఈరోజు జాగారం చేయనున్నారు. పుట్టినరోజు విషెష్ తో పాటు ఫస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus