సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ షూటింగ్ నవంబర్ నెల నుంచి మొదలు కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయలేదని త్వరలోనే ఆ పనులు పూర్తి చేసి మహేష్ కు త్రివిక్రమ్ కథ వినిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కాగా త్రివిక్రమ్ తాజాగా విలన్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. సంజయ్ దత్ కేజీఎఫ్ ఛాప్టర్2లో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కు అఖండ సినిమాలో కూడా నటించే అవకాశం రాగా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. అయితే సౌత్ సినిమాలపై దృష్టి పెట్టిన సంజయ్ దత్ మహేష్ త్రివిక్రమ్ మూవీలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు పార్థు,
అతడే పార్థు అనే టైటిల్స్ వినిపిస్తుండగా టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తుండగా ఆ సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టమేనని సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావిస్తున్నారు.