నిన్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజ్ అయ్యింది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొంత మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. దీంతో నిన్న మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ మూవీలో మహేష్ నటనకి పేరు పెట్టేవాళ్ళు ఉండరేమో అనాలి. ‘పోకిరి’ ‘ఖలేజా’ ‘దూకుడు’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాల్లో కంటే కూడా చాలా ఎనర్జిటిక్ గా మహేష్ కనిపించాడు.
తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఈసారి ఫైట్స్ లో కూడా గ్రేస్ ను చూపించాడు. అయితే మూవీ కోసం మహేష్ బాబు చాలా కష్టపడ్డాడు అనే విషయం చాలా మందికి తెలీదు. జిమ్ లో అతను గంటల కొద్దీ వర్కౌట్లు చేసి, చెమటలు చిందించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మహేష్ ఫిట్నెస్ ట్రైనర్ అయిన మినాష్ ఓ వీడియోని షేర్ చేశాడు. అతను ఈ వీడియో గురించి మాట్లాడుతూ..
“ఈ రోజున, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ రిలీజ్ అయ్యింది.గత రెండేళ్లుగా ఈ చిత్రం కోసం తెరవెనుక ఏమి జరిగిందో అందరికీ తెలియజేయడానికి నేను ఈ సమయం తీసుకుంటున్నాను.కోవిడ్ ఆంక్షల కారణంగా సినిమాల విడుదల చాలా కాలం లేట్ అయ్యింది. అయితే ఈ సినిమాని ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని మహేష్ కష్టపడ్డారు.
ఓవర్ టైం షూటింగ్ చేయడం, అర్ధరాత్రి కూడా వర్కౌట్లు చేయడం వంటివి చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరి కోసం తన లైఫ్ పెట్టి పనిచేసారు మహేష్. ‘సర్కారు వారి పాట’ విడుదల సందర్భంగా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అంటూ మినాష్ ట్వీట్ చేశారు.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!