Guntur Kaaram: మహేష్ – త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ గ్లింప్స్ ఎలా ఉందంటే..!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ‘మహేష్ 28’ ‘ఎస్.ఎస్.ఎం.బి 28’ వంటి వర్కింగ్ టైటిల్స్ తో ఈ మూవీ ప్రచారంలో ఉంది. అయితే ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా .. మహేష్- త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ ను అలాగే గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి టైటిల్ ‘గుంటూరు కారం’ గా ఫిక్స్ చేసినట్టు వెల్లడించారు.

అలాగే 1 నిమిషం 4 సెకన్ల నిడివి గల గ్లింప్స్ కూడా వదిలారు. ఇందులో మహేష్ గుంటూరు మిర్చి యార్డులో బీడీ కాల్చుకుంటూ తలకి రెడ్ టవల్ కట్టుకుని హీరో స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు.అటు తర్వాత విలన్ గ్యాంగ్‌ను కుమ్మేస్తూ .. నోట్లో బీడీ పెట్టుకుని.. ‘‘ ఏంది అట్టా చూస్తాండావ్.. బీడీ ఏమైనా త్రీడీలో కనబడతందా’’ అంటూ చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ స్టైల్లో ఉంది.

ఓ విధంగా ఫ్యాన్స్ కి అలాగే మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఈ డైలాగ్ ఉందని చెప్పవచ్చు. కాకపోతే ఇది చాలా వరకు ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘సిత్తరాల’ పాటలోని ఫైట్ ను గుర్తుచేసే విధంగా ఉందని చెప్పాలి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలానే ఉంది. అయితే ఈ గ్లింప్స్ చివర్లో మహేష్ స్టైల్ గా బీడీ కాలుస్తూ నడుచుకుంటూ వస్తుంటే రౌడీలు మోకాళ్ళ పై కూర్చుని స్వాగతం పలకడం మాత్రం బాగా హైలెట్ అయ్యింది. (Guntur Kaaram) ఈ గ్లింప్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus