సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న అనేక ప్రశ్నలకు మరియు సందేహాలకు సమాధానం ఇవ్వనున్నారు. విషయంలోకి వెళితే మహేష్ ఫ్యాన్స్ నెలలుగా ఆయన కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు వంశీ పైడి పల్లితో చేయాలని అనుకున్నారు. కొన్ని కారణాల చేత మహేష్ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు. దీనితో మహేష్ ఏ దర్శకుడితో చేస్తున్నాడు.
అది ఎలాంటి సినిమా, కథేమిటీ, జోనర్ ఏమిటి ఇలా అనేక ప్రశ్నలతో ఫ్యాన్స్ సతమతమై పోతున్నారు. మహేష్ రేపు ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పబోతున్నారు. రేపు సాయంత్రం 5:00 గంటల నుండి అభిమానులు అడిగే ప్రశ్నలకు ఇంస్టాగ్రామ్ వేదికగా సమాధానాలు చెప్పనున్నారు. తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మహేష్ పాల్గొననున్నారు. ఈ సెషన్ లో ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న అన్ని ప్రశ్నలకు ఆయన జవాబులు ఇవ్వనున్నారు.
ఇక మహేష్ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నట్లు, దాని టైటిల్ సర్కార్ వారి పాట అని కూడా ప్రచారం జరుగుతుంది. మహేష్ ఈ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారన్న వార్త రావడం మరో విశేషం. రేపు సాయంత్రానికి వీటన్నింటికి సమాధానం స్వయంగా మహేష్ చెవుతారు.