వివాదాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా దూరంగా ఉంటారు. ప్రాంతీయ, ప్రాంతీయేతర సమస్యల ఉద్యమాలపై అసలు మాట్లాడరు. తొలి సారి ఆయన ఓ పోరాటానికి మద్దతు తెలిపారు. తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టుని నిలిపేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు తమిళీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ జల్లికట్టు అనే నినాదంతో తమ వ్యతిరేకతను చాటుతున్నారు. నిన్న (గురువారం) జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనకు కోలీవుడ్ స్టార్స్ పూర్తి మద్దతు తెలిపారు.
తమిళనాడు ప్రజలు శాంతియుత మార్గంలో నిరసన చేపట్టడం గర్వంగా ఉందని, ప్రజా ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని కోలీవుడ్ సినీ ప్రముఖులు అండగా నిలిచారు. దక్షిణ భారత చలనచిత్ర కార్మికులు సైతం నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న రాత్రి స్పందించారు. “తమిళనాడు స్పిరిట్ జల్లికట్టు. ఈ అనుమతి కోసం తమిళీయులందరూ కలిసికట్టుగా పోరాడడం గర్వంగా ఉంది. మీ ఆవేదన తప్పకుండా వారి చెవిన పడుతుంది.” అంటూ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. టాలీవుడ్ నుంచి ఈ పోరాటంపై స్పందించిన మొదటి వ్యక్తి మహేష్ బాబు కావడంతో తమిళనాడు ప్రజలు అతనికి థాంక్స్ చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.