మహేష్ సినిమా టైటిల్ ఎలా ఉంది??

టాలీవుడ్ లో ప్రిన్స్ మ్యానియా మామూలుగా లేదు….ఒక పక్క బ్రహ్మోత్సవం బారీ డిజాస్టర్ తో కాస్త నిరాశలో ఉన్న అభిమానులను ఎలా అయినా స్యాటిస్ఫై చెయ్యాలి అన్న కోణంలో మన ప్రిన్స్ ఒక భారీ చిత్రాన్నే ప్లాన్ చేశాడు….దాదాపుగా 80కోట్ల రూపాయల వ్యయంతో బడా సినిమాని మురుగుదాస్ డైరెక్షన్ లో అటు తెలుగు ఇటు తమిళంలోనూ నటిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటికీ సినిమా మొదలు అయినప్పటినుంచి అనేక టైటిల్స్ అనుకుంటూ వస్తున్నారు….మొదట ఎనిమీ.. ఆ తర్వాత వాస్కోడిగామా.. రీసెంట్ గా అభిమన్యుడు అనే టైటిల్స్ సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి.

వీటన్నిటినీ ఎప్పటికప్పుడు యూనిట్ ఖండిస్తూనే ఉంది కానీ.. ఇప్పుడో కొత్త టైటిల్ సర్క్యులేట్ అవుతోంది. ‘ఏజంట్ శివ’ అనే టైటిల్ ని సెట్ చేశారని.. దాదాపు ఖాయం చేసినట్లేనని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండడం.. తెలుగు తమిళ భాషల్లో ఒకే టైటిల్ ని పెట్టేందుకు యూనిట్ ప్రయత్నిస్తుండడం.. ఏజంట్ శివ అనే టైటిల్ సూటబుల్ అనేందుకు ఆస్కారం ఇస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పై చిత్ర యూనిట్ మాట పక్కన పెడితే అభిమానులు కాస్త నిరాశగా ఉన్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి….తెలుగులో రామ్ గోపాల వర్మ ‘శివ’ మినహా ఈ ‘శివ’ టైటిల్ తో వచ్చిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన నేపధ్యంలో ఇటువంటి టైటిల్ ఆలోచనే వద్దు అని మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోకు మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్. మరి ఈ విషయంపై మురుగుదాస్ ఏం చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus