కీలక ఛేజింగ్ సీన్ షూటింగ్ లో సూపర్ స్టార్

ఒక్కడు చిత్రంలో వర్షం పడుతుండగా భూమికను రక్షించే ఛేజింగ్ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది.  అటువంటి అనుభూతిని సూపర్ స్టార్ మహేష్ మళ్లీ అందివ్వనున్నారు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న చిత్రం ప్రస్తుతం  హైదరాబాద్ లోని పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ అయిన మహేష్ బాబు విలన్ బ్యాచ్ ని పట్టుకునే ఛేజింగ్ సీన్ ని గత రెండు రోజులుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్సు భవన్, సంధ్య థియేటర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. కృత్రిమ భారీ వర్షాన్ని అరేంజ్ చేసి ఫైట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.  ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ మరో మూడు రోజులు నగరంలో జరుగుతుందని చిత్ర బృందం వెల్లడించింది. దసరా అనంతరం గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కి పయనం కానున్నట్లు తెలిపింది. అక్కడే 18 రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ మూవీకి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం  ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=j4Fb7RbMZpA

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus