మహేష్, మురుగదాస్ సినిమా పాటలు విడుదల అప్పుడే

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లోని స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో మహేష్‌, విదేశీ భామలపై ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందుకు శోభి మాస్టర్‌ వినూత్నంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ ని ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

అప్పుడే  చిత్రం పేరు కూడా రివీల్ కానుంది. హరీష్ జైరాజ్‌ స్వరపరిచిన పాటలు వినాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ఆడియో వేడుక నిర్వహించాలని నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌ లు భావిస్తున్నారు. ఈ విషయాన్నీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జూన్ 23 న థియేటర్లోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus