Mahesh , Trivikram: వామ్మో.. త్రివిక్రమ్ మహేష్ మూవీని అలా ప్లాన్ చేశారా?

ఈ మధ్య కాలంలో ఏ సినిమా గురించి జరగని స్థాయిలో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా కథ మారిందనే సంగతి తెలిసిందే. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. అఆ తరహా సినిమాను త్రివిక్రమ్ మహేష్ తో తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మహేష్ బాబును కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కథలలో ప్రేక్షకులు చూసి చాలాకాలం అయ్యింది.

పూజా హెగ్డే, శ్రీలీల పాత్రలకు సంబంధించి కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం లేదని తెలుస్తోంది. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తే మాత్రం ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ తన సినిమాలకు థమన్ కు మాత్రమే చాన్స్ ఇస్తుండగా ఈ సినిమాకు కూడా ఆ లక్కీ ఛాన్స్ థమన్ కు దక్కింది.

త్రివిక్రమ్ సినిమాలంటే థమన్ కూడా మరింత శ్రద్ధగా పని చేస్తున్నారు. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదని సమాచారం అందుతోంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం భారీ స్థాయిలో డిమాండ్ నెలకొంది. పూజా హెగ్డే ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus