బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ కొంతమంది హౌస్ మేట్స్ కి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ముమైత్ రాగానే అఖిల్ అండ్ అజయ్ టీమ్ లో చేరిపోయింది. అంతేకాదు, జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చి అఖిల్ అండ్ టీమ్ ని గెలిపించడంలో కీలకపాత్ర వహించింది. ఈ విషయాన్ని ముందుగానా మహేష్ విట్టా ఊహించానని డైరెక్ట్ గా ముమైత్ ముఖంపైనే చెప్పేశాడు. నువ్వు జడ్జిగా వచ్చినపుడే అఖిల్ వైపే తీర్పు ఇస్తావని అనుకున్నాను అని , పార్షియాలిటీ గేమ్ ఆడావని అన్నాడు.
ఈ విషయాన్ని ముమైత్ ఖాన్ తీసుకోలేకపోయింది. అలాగే, బిందు ఇంకా శివ ఇద్దరూ కూడా ముమైత్ ఖాన్ తీర్పు పై అసహనాన్ని చూపించారు. వీకండ్ నాగార్జున కొన్ని పాయింట్స్ మాట్లాడితే హౌస్ మేట్స్ కి క్లారిటీ వచ్చేస్తుంది. మార్నింగ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయిన తర్వాత ముమైత్ ఖాన్ హౌస్ మేట్స్ కి కొన్ని ట్యాగ్స్ ఇచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ పర్సనాలిటీలు ఎలా ఉన్నాయో చెప్తూ వాళ్లకి కేటాయించిన బౌల్స్ లో రంగు ఇసుకని తగిన పాళ్లలో నింపింది ముమైత్.
ఇక్కడే తన మనసులో హౌస్ మేట్స్ గురించి ఏమనుకుంటోందో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడే మరోసారి ముమైత్ ఖాన్ కి మహేష్ విట్టాకి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. నువ్వు ఇచ్చింది నేను యాక్సెప్ట్ చేయట్లేదంటూ మహేష్ విట్టా ఎదురు తిరిగాడు. దీంతో ముమైత్ ఖాన్ మహేష్ తో ఆర్గ్యూ చేసింది. మహేష్ ఇప్పుడు తీర్పు చెప్పమని, బిందు విషయంలో ఏం పాయింట్స్ ఉన్నాయో మాట్లాడమని అన్నాడు. అసలు నీకు ఏ పాయింట్ అర్ధం కాలేదని, ఊరికే జస్ట్ లైక్ దట్ తీర్పు ఇచ్చేశావని అన్నాడు. అంతేకాదు, ఆ తర్వాత బిందు విషయంలో కూడా గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.
నేను అఖిల్ ని అన్న పాయింట్ నీకు అర్ధం కాలేదని, అందుకే పక్కనున్న వాళ్లని కన్ఫర్మేషన్ అడిగేసరికి వాదన అనవసరం అని అనుకున్నాని బిందు చెప్పింది. ముమైత్ ఖాన్ టాస్క్ ఆడుతుంటే వీరిద్దరూ ఎదురుదాడి చేశారు. మొత్తానికి రీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ కాన్ కొంతమందికి యాంటీ అయ్యింది. ముమైత్ ఖాన్ మాట విని కెప్టెన్సీ టాస్క్ ఆడినందుకు స్రవంతి కూడా అఖిల్ ని నిలదీసింది. ఐదువారాల నుంచీ ఉన్న నేను రిక్వస్ట్ చేశాను, కానీ మీరు ముమైత్ మాట విన్నారు. అది నన్ను బాధించింది అని చెప్పింది స్రవంతి. అఖిల్ ఈ విషయంలో స్రవంతిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు.
తను చెప్పింది కామ్ గా వింటూ కూర్చున్నాడు. నిజానికి కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్ , అజయ్ ఉన్నప్పుడు స్రవంతి ఇంకా అషూ ఇద్దరూ కూడా రేస్ లో ఉన్నారు. ఇక్కడే స్రవంతి ఈసారి నాకు కెప్టెన్సీ ఇమ్మని, ఎందుకంటే ఈసారి నామినేషన్స్ లో ఉన్నా కాబట్టి ఒకవేళ ఎలిమినేట్ అయినా సంతృప్తిగా బయటకి వెళ్తానని చెప్పింది. కానీ, అఖిల్ అండ్ అజయ్ ఇద్దరూ కూడా ముమైత్ మాటలకి ఇన్ఫులెన్స్ అయ్యారు. వాళ్లకోసం వాళ్లు గేమ్ ఆడుకున్నారు. మొత్తానికి అదీ మేటర్.