మహేష్ అభిమానులను థ్రిల్ కి గురిచేసే ఇంటర్వెల్ సీన్
- February 28, 2017 / 05:44 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. మొన్నటి వరకు ముంబై లో ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేసిన చిత్ర బృందం ప్రస్తుతం రాయలసీమలోని జమ్మల మడుగులో కీలక సీన్ షూట్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్న ఇందులో ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ గా ఉంటుందని సమాచారం. పోలీస్ పాత్రధారి అయిన మహేష్ విలన్ ని వెంటాడే సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని తెలిసింది. విశ్రాంతికి ముందు వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ లో కార్ ఛేజ్ లతో పాటు, బోట్ ఛేజ్ లు కూడా ఉంటాయని, అందుకోసం మూడు కోట్లు ఖర్చుచేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సీన్ చూసి మహేష్ అభిమానులు థ్రిల్ అవుతారని తెలిపింది. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లండన్లో సిద్ధమవుతోంది. జూన్ 23 న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















