కొత్త షెడ్యూల్ కి సిద్దమవుతున్న మహేష్, మురుగదాస్ టీమ్
- April 10, 2017 / 11:52 AM ISTByFilmy Focus
తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఠాగూర్ మధు, ఎం వీ ప్రసాద్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నై లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వియత్నాం లో షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా చెన్నై షెడ్యూల్ మొదలెట్టారు. దీని తర్వాత కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. వెంటనే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ఎస్.జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియదర్శి తదితరులు పాల్గొననున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ కనిపించనున్న ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. హరీష్ జయ్ రాజ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి స్పైడర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫస్ట్ లుక్ ని తమిళ సంవత్సరాది ఏప్రిల్ 14 న రిలీజ్ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















