ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ డైరక్షన్లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ‘వియత్నాం’ లో కీలక సీన్ షూట్ చేయనున్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం మహేష్, మురుగదాస్ బృందం రేపు బయలుదేరనున్నారు. పది రోజుల పాటు సాగే ఏ షెడ్యూల్ లో మహేష్ బాబు, విలన్ ఎస్.జె సూర్యకు మధ్య ఫైట్ ఉంటుందని సమాచారం.
దీనిని పీటర్ హెయిన్స్ డిఫరెంట్ గా కంపోజ్ చేయనున్నారు. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఠాగూర్ మధు, ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి స్పైడర్ అనే పేరు కొత్తగా ప్రచారం లోకి వచ్చింది. ఈ టైటిల్ నిజమా? కాదా? అనేది ఉగాదికి తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.