ప్రస్తుత కాలంలో చాలామంది యువత అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా అతి చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో డబ్బు సంపాదించడం కోసం రాత్రి పగులు తేడా లేకుండా పనిచేయడం వల్ల ఆ ఒత్తిడి భారాన్ని గుండే భరించలేకపోతోంది. పని ఒత్తిడి మాత్రమే కాకుండా ఇతర కారణాలవల్ల కూడా యువత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతుంది.
తాజాగా నందమూరి తారకరత్న కూడా 39 ఏళ్ల వయసులో తీవ్ర గుండెపోటు రావడంతో మరణించాడు. జనవరి 27వ తేదీ యువ గలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అదే రోజు మధ్యాహ్నం తీవ్ర గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రతిమ చికిత్స చేసిన తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ దాదాపు 20 రోజులపాటు చికిత్స తీసుకున్న తారకరత్న తాజాగా శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో నందమూరి కుటుంబంతోపాటు సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదఛాయలు అమ్ముకున్నాయి.
అతి చిన్న వయసులోనే తారకరత్న ఇలా గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీరని లోటు మిగిలింది. అయితే అతి చిన్న వయసులోనే తారకరత్న ఇలా గుండెపోటుతో మరణించడానికి ఒత్తిడే కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన తారకరత్న మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. దీంతో హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విల్లన్ గా కొన్ని సినిమాలలో నటించాడు.
ఇక్కడ కూడా సరైన గుర్తింపు రాకపోవటంతో రాజకీయాలలో రాణించాలని భావించాడు. ఈ క్రమంలో 2024 లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నారా లోకేష్ ప్రారంభించిన “యువగలం” పాదయాత్రలో పాల్గొన్నాడు. నందమూరి వారసుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నిత్యం తపించిన తారకరత్న అధిక ఒత్తిడికి గురవడం వల్ల గుండెపోటు వచ్చిందని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?