Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో ట్విస్ట్.. అతన్ని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు..!

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి  (Allu Arjun)  ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. ఓ పక్క రాజకీయ నాయకులూ మరోపక్క పోలీసులు.. అల్లు అర్జున్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ను విచారించడానికి పోలీసులు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విచారణలో కీలక విషయాలు అల్లు అర్జున్ నుండి పోలీసులు రాబట్టారని సమాచారం. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అల్లు అర్జున్ బౌన్సర్లలో ఒకరైన ఆంటోనీ అని తేలిందట.

Allu Arjun:

దీంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది. జనం వస్తున్నప్పుడు వారిని ఎక్కువ ఇతను వెనక్కి నెట్టడం మొదలుపెట్టిన తర్వాతే తొక్కిసలాట ఎక్కువగా జరిగిందని పోలీసులు గుర్తించారట. ఇక ఈ కేసులో A11 ముద్దాయిగా అల్లు అర్జున్ ఉన్న సంగతి తెలిసిందే. గత వారం ఆయన జైలుకు వెళ్లి రావడం జరిగింది. మధ్యంతర బెయిల్ కి ముందుగా అప్లై చేసుకోవడం వల్ల.. అల్లు అర్జున్ కి తొందరగా బెయిల్ దొరికినట్టు అయ్యింది.

మరోపక్క సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ఆమె కొడుకు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ అల్లు అర్జున్ రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించడానికి రెడీ అయ్యారు. మరోపక్క ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) నిర్మాతలు .. ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ (Naveen Yerneni) , రవి శంకర్ (Y .Ravi Shankar)..లు కూడా బాధితుల కుటుంబాన్ని పరామర్శించి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించారు.

రాజాసాబ్.. హై వోల్టేజ్ సీన్స్ కోసం బిగ్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus