DJ Tillu: రాధికా క్యారెక్టర్ ను లేపేస్తున్నారా..?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ‘డీజే టిల్లు’ సినిమా. సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్, అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివెరీ అన్నీ కూడా ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమాకి క్లాప్ కొట్టారు.

త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానుంది. ‘డీజే టిల్లు’తో పాటు రాధికా క్యారెక్టర్ కూడా సినిమాలో బాగా పండింది. ఈ పాత్రలో నేహాశెట్టి కనిపించింది. అయితే ఇప్పుడు సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ గా ఆమెను తీసుకోవడం లేదని సమాచారం. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. అయితే నేహాశెట్టి మాత్రం అతిథి పాత్రలో కనిపిస్తుందట. అది కూడా చాలా తక్కువసేపు అని తెలుస్తోంది. ‘డీజే టిల్లు 2’లో జరిగే ప్రధానమైన మార్పు ఇదేనట.

పార్ట్ 1లో కనిపించిన పాత్రలు కొన్ని పార్ట్ 2లో కూడా కొనసాగుతాయని తెలుస్తోంది. మరికొన్ని కొత్త పాత్రలు వచ్చి చేరతాయట. వాటిలో హీరోయిన్ రోల్ ప్రధానమైనదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ గ్లామరస్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడతారట. అయితే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. దర్శకుడు విమల్ కృష్ణకి వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన సిద్ధూ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్ట్ షురూ అవుతుందని టాక్. మరేం జరుగుతుందో చూడాలి!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus