Pushpa2: పుష్ప 2.. విషయంలో ఫాలో అవుతున్న సెంటిమెంట్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. అయితే వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని మేకర్స్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని గతంలో మేకర్స్ వెల్లడించారు. అయితే కొన్ని స్క్రిప్ట్ పనుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. అయితే వచ్చే నెల షూటింగ్ ప్రారంభం అయితే శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అధిక సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ సుకుమార్ తాజాగా రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈయన పుష్ప 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాటలను బట్టి చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో అయితే వారు ప్లాన్ చేసిన విధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి కుదురుతుందని అందుకే వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసినట్టు వెల్లడించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కేజిఎఫ్ 2 సినిమా సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పోటీగా పుష్ప 2 ఉండాలని స్క్రిప్ట్ ఈ విషయంలో సుకుమార్ కొన్ని మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే పుష్ప సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకోగా పార్ట్ 2 ఈ విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ డిసెంబర్ 17 2023వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus