Malavika Mohanan, Samantha: సామ్‌ గురించి మాళవిక మాటలు విన్నారా..!

టాలీవుడ్‌లో సమంతను ఇష్టపడని వారుండరు. కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆమె గొప్పతనాన్ని అందరూ మెచ్చుకుంటారు. కొత్త తరం కథానాయికలు అయితే ఆమెను ఆరాదిస్తారు కూడా. అలాంటి వారిలో జాబితాలో మాళవిక మోహనన్‌ కూడా వచ్చి చేరింది. అవును, తమిళ కొత్త బ్యూటీకి సమంత అంటే చాలా ఇష్టమట. ఆమె సినిమాలు ఎంచుకునే తీరు, పాత్ర కోసం పడే కష్టం, ఫిట్‌నెస్‌ కాపాడుకునే విధానం… ఇలా తనకు చాలా ఇష్టమని చెప్పింది మాళవిక మోహనన్‌.

Click Here To Watch Now

ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం అంటే 19 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్‌ ప్రారంభించింది మాళవిక మోహనన్‌ ‘పాతమ్‌ పోలే’ అనే మలయాళ సినిమాలో తొలిసారి నటించింది. ఆ తర్వాత సినిమాలు చేస్తున్నా… కథానాయికగా పేరొచ్చింది మాత్రం విజయ్‌ ‘మాస్టర్‌’తోనే. ఆ సినిమాలో చారులతగా పద్ధతిగా కనిపించిన మాళవిక… సోషల్‌ మీడియాలో మాత్రం యమ హాట్‌గా ఉంటుంది. ఒక్కో ఫొటో ఒక్కో ఆటమ్‌ బాంబ్‌ అని చెప్పొచ్చు. స్కిన్‌ షోకి ఏ మాత్రం వెనుకడాని తత్వం ఆమెది.

తెలుగులో ఆమె ఎంట్రీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ మధ్య శంకర్‌ – రామ్‌ చరణ్‌ సినిమాలో ఉంటుంది అని వార్తలొచ్చినా అవి వర్కౌట్‌ అవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్‌ కొత్త సినిమాలో నటిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే… నటిగా మీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే… సమంత గురించి వివరంగా చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్‌. నా దృష్టిలో సమంత కెరీర్‌ అద్భుతం. ఆమె గ్లామర్‌గా నటించింది, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది.

ఇలా అన్నింటా తన ముద్ర వేసింది అంటూ చెప్పుకొచ్చింది మాళవిక. ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’, ‘ది ఫ్యామిలీ మేన్ 2’, ‘పుష్ప’… ఇలా ఆమె సినిమాల ఎంపిక ఎంతో వెరైటీగా ఉంటుంది అని చెప్పింది. అలాగే సమంత డేరింగ్ ఆటిట్యూడ్ కూడా తనకు బాగా నచ్చుతుంది అని అంది మాళవిక మోహనన్‌. ఆమె తాజాగా ధనుష్ సరసన ‘మారన్’ అనే సినిమాలో నటించింది. అయితే ఆమె పాత్రకు సరైన మార్కులు పడలేదు. మరి తెలుగులో ఏం చేస్తుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus