సినీ పరిశ్రమకి మరో షాకింగ్ న్యూస్… ఆ కమెడియన్ ఇక లేరు..!

నిన్నటి నుండీ సినీ పరిశ్రమలో వరుసగా బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి నిన్న మరణించారు. ఆ వార్తని అంతా ఇంకా డైజెస్ట్ చేసుకోకముందే.. నటుడు దీప్‌ సిద్ధూ రోడ్డు యాక్సిడెంట్ లో మరణించాడనే వార్త బయటకి వచ్చింది. ఇక సాయంత్రానికి ప్రముఖ నటుడు మహర్షి రాఘవ తల్లిగారు గోగినేని కమలమ్మ గారు కూడా మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషాద ఛాయలు ఇంకా వీడక ముందే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ బయటకి వచ్చింది.

Click Here To Watch

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ కమెడియన్ ప్రదీప్ కొట్టాయం నిన్న గుండెపోటుతో మరణించారు. ఈయన ఒక మలయాళీ నటుడు. 70 కి పైగా సినిమాల్లో నటించారు. ‘ఏమాయ చేసావే’ ‘రాజా రాణి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించారు. 2001 లో కెరీర్ ను ప్రారంభించిన ఈయన అనతి కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈయన మరణవార్త పై సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రదీప్ విచారం వ్యక్తం చేస్తూ ఆయనకి అంతిమ నివాళ్లులు అర్పించారు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘కుంజిరామాయణం’, ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘వెల్‌కమ్ టు సెంట్రల్ జైలు’, ‘కట్టపనయిలే రిత్విక్ రోషన్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు ప్రదీప్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus