Director: సినీ పరిశ్రమలో మరో విషాదం.. టాప్ డైరెక్టర్ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గద్దర్ మరణించిన 24 గంటల్లోనే తమిళ నటి సింధు క్యాన్సర్ తో మరణించింది. ఆ తర్వాత కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. ఓ హాలీవుడ్ దర్శకుడు కూడా మరణించాడు. ఆ షాక్ ల నుండీ సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖీ మరణించారు.

అతని వయసు 63 ఏళ్లు. గుండెపోటు కారణంగా ఆయన సోమవారం నాడు మరణించినట్టు తెలుస్తుంది. కేరళలోని ఓ హాస్పిటల్ లో చేర్చినప్పటికీ ఉపయోగం లేకపోయింది. అతని మరణవార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్మో సాయంతో అతనికి చికిత్స అందించడానికి శతవిధాలా వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఇక సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, ప్రొడ్యూసర్ గా ఆయన ఓ వెలుగు వెలిగారు.

మోహన్ లాల్, సిద్ధిఖీ (Director) మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. వీరి కాంబోలో ‘రాంజీ రావు స్పీకింగ్’, ‘ఇన్ హరిహర నగర్’, ‘గాడ్ ఫాదర్’, ‘వియత్నామ్ కాలనీ’, ‘కాబూలీవాలా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.’రాంజీ రావు స్పీకింగ్’ సిద్ధిఖీకి మొదటి చిత్రం.

‘హిట్లర్’ కి కథ అందించింది ఈయనే. మలయాళంలో హిట్ అయిన మమ్ముట్టి హిట్లర్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ అయ్యింది. చిరు వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘హిట్లర్’ తో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus