విజయ్ దేవరకొండ తాజా చిత్రం “ఫైటర్” (వర్కింగ్ టైటిల్)ను పాన్ ఇండియన్ సినిమాగా మార్చడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఆల్రెడీ హిందీ హీరోయిన్ అనన్య పాండేను కథానాయికగా పెట్టుకొని హిందీ మార్కెట్ ను టార్గెట్ లో పెట్టుకొన్న పూరీ. రమ్యకృష్ణను మదర్ రోల్ కోసం రమ్యకృష్ణను ఫైనల్ చేసి తమిళ మార్కెట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక మిగిలింది మలయాళం మార్కెట్. “డియర్ కామ్రేడ్”తో విజయ్ మలయాళ ప్రేక్షకులను పలకరించినప్పటికీ..
సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆశించిన స్థాయి ఇమేజ్ సంపాదించుకోలేకపోయాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూరీ ఓ పాపులర్ & సీనియర్ మలయాళీ నటుడ్ని సినిమాలోని తండ్రి పాత్ర కోసం ఎంపిక చేసాడని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు యాంగ్రీ పోలీస్ గా సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న సురేష్ గోపీ. 90ల కాలంలో ఆయన నటించిన మలయాళ సినిమాలన్నీ డబ్బింగ్ రూపంలో విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించేవి.
ఈమధ్యే దుల్కర్ సల్మాన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన సురేష్ గోపీ ఇటీవలే తన పుట్టినరోజు సందర్బంగా హీరోగానూ కొత్త సినిమా ఎనౌన్స్ చేసాడు. ఇప్పుడు ఈయన్నే విజయ్ దేవరకొండ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేశారు పూరీ జగన్నాధ్. సో, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, సురేష్ గోపీల వంటి హేమాహేమీలు జాయిన్ అవ్వడం వల్ల “ఫైటర్” వేల్యూ విశేషంగా పెరిగింది.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?